TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంజనీరింగ్‌ కాలేజీలపై టాస్క్‌ఫోర్సు తనిఖీలు లేనట్లే

Published on: Thu Oct 4, 2012 1:06PM

Engineering Colleges, Tast Force Raids, Government, Raids Stalled, Fake Seats Availability

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల పని తీరు పెంచుతామని సరైన నిర్వహణకోసం టాస్క్‌ ఫోర్సుతో తనిఖీలు చేయిస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం తన పని తీరును మార్చు కోలేదు. అందుకు ఉదాహరణే ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఈ రోజు నుండి జరపవలసిన టాస్క్‌ఫోర్సు తనిఖీలను ఆపవల్సిందిగా  సాంకేతిక విద్యాశాఖ జారీ చేసిన జీవోలే.  ప్రవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇంతవరకు నెరపిన రాయబారాలు ఫలించాయి. దీంతో  ప్రయివేటు ఇంజనీరింగ్‌లలో మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాలు పెరుగుతాయని ఎదురుచూసిన విద్యార్దులు, వారి తల్లి దండ్రులు ఎంతో నిరాశకు గురి అవుతున్నారు. ప్రతి ఏడాది లక్షలు అడ్డదారిలో సంపాదిస్తున్న ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈ ఏడాది కూడా అనుకూలంగా పరిస్థిలనుమార్చుకున్నారు. ఇప్పటికే కొన్ని కాలేజీలు డిమాండు వున్న బ్రాంచెస్‌లో కృత్రిమ కొరత సృష్టించి అక్రమ పద్దతుల్లో స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో ఐదు లక్షలనుండి మొదలు బెట్టి అందిన కాడికి దండుకుంటున్నారు.ప్రవేటు కాలేజీల ఇష్టారాజ్యంగా మారిందని ఇక పై ఈరాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెరుగుతాయనుకోవడం ఇక కలే నని మేధావులు పెదవి విరుస్తున్నారు