2ల‌క్షల ఇంజ‌నీరింగ్ సీట్లు మిగిలిపోనున్నాయి

 

ఈ ఏడాది కూడా ఇంజ‌నీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి. ఇప్పటికే తొలివిడ‌త ఇంజ‌నీరింగ్ కౌన్సిలింగ్ పూర్తికాగా ల‌క్షకు పైగా సీట్లు మిగిలిపోయాయి. దీంతో తుదివిడ‌ద కౌన్సింలిగ్ పూర్తయ్యేస‌రికి దాదాపు 2ల‌క్షల‌కు పైగా సీట్లు మిగిలిపోతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు విద్యాశాఖ అధికారులు.

బీ ఫార్మసీ విభాగంలో కూడా భారీగా సీట్లు మిగిలిపోయాయి. 8500 సీట్లు ఉండ‌గా కేవ‌లం 558 సీట్లు మాత్రమే భ‌ర్తి అయ్యాయి. అంటే ఇంకా 7,900 వంద‌ల‌కు పైగా సీట్లు కాలీగానే ఉన్నాయి. ఈ మేర‌కు అన్ని వివ‌రాల‌ను విద్యాశాఖ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. విద్యార్ధుల‌కు ఈ స‌మాచారాన్ని ఎస్ ఎం ఎస్ ద్వారా అందించింది.

ఈ ఏడాది 2,18,893 మంది ఇంజనీరింగ్ అర్హత సాదించ‌గా, స‌ర్టిఫికేష‌న్ల వెరిఫికేష‌న్‌కు కేవ‌లం 1,30,20 మంది మాత్రమే హాజ‌ర‌య్యారు. ఇరు ప్రాంతాల్లో జ‌రుగుతున్న స‌మైక్య, విభ‌జ‌న ఉద్యమాల‌తో చాలా మంది విద్యార్థులు వెరిఫికేష‌న్‌కు హాజ‌రు కాలేక‌పోయారు. ఇంజ‌నీరింగ్, ఫార్మాసి విభాగంలో 2,34,488 సీట్లు అందుబాటులో ఉండ‌గా 1,08,098 సీట్లు మాత్రమే భ‌ర్తి అయ్యాయి. దీంతో ఈ ఏడాది భారీ సీట్లు మిగిలిపోనున్నాయి. యాజ‌మాన్య కోట‌లో ల‌క్షకు పైగా సీట్లు అందుబాటులో ఉండ‌గా కేవ‌లం ప‌దివేల సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి.