ఉద్యోగులకు ఉద్వాసన బాటలో మెక్ డోనాల్డ్ కంపెనీ
Published on: Mon Apr 3, 2023 10:37AM
ఆర్థిక మాంద్రం కారణంగా ప్రముఖ సంస్థలు ఉద్యోగులకు ప్రపంచ వ్యాప్తంగా ఉద్వాసన పలుకుతున్నాయి. ఆ దారిలో ఇప్పుడు ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ మెక్ డోనాల్డ్ కూడా నడుస్తోంది. ఆ సంస్థ తన ఉద్యోగుల ఉద్వాసనకు రెడీ అయ్యింది.
అందులో బాగంగా అమెరికాలోని సంస్థకు చెందిన పలు కార్యాలయాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సంస్థ రెడీ అయ్యిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది.
కాగా సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులకు నేటి నుంచి బుధవారం వరకూ వర్క్ ఫ్రం హోం చేయాలని సంస్థ యాజమాన్యం ఇప్పటికే ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉద్యోగాల కోతలకు సంబంధించి బుధవారం మెక్ డోనాల్డ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని బిజినెస్ రంగ నిపుణులు చెబుతున్నారు.


