ఎమ్మిగనూరు ఎన్నికలు ఎంపీ కోట్లకు పెనుసవాల్?
Published on: Sat Apr 14, 2012 3:53PM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లి ఎన్నికలు ఎంపీ కోట్లకు పెనుసవాల్ గా మారాయి. ఈయన మద్దతుతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న రుద్రగౌడుకు అన్యాయం చేస్తే అది తనకు జరిగినట్లే అని ఎంపి బావిస్తున్నారు. గౌడ్ కన్నా ఎన్నో ఏళ్ళ నుంచి పరినే నమ్ముకున్న తిక్కారెడ్డి బలమైన అభ్యర్ధి అని ఎంపీ వ్యతిరేఖ వర్గం ప్రచారం చేస్తోంది.దీంతో అధిష్టానం ఎవరికీ టిక్కెట్టు ఇస్తే మంచిదో కసరత్తులు ప్రారంభించింది. ప్రత్యేకించి ఎంపిక కూడా ఎంపికి అనుకూలంగా అయితేనే పార్టికి కొంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ది చెన్నకేశవరెడ్డి కూడా ఎంపీ కోట్లకు బంధువు.ఈయన కాంగ్రెస్ ఓట్లను చీల్చడం కాయమని ఇదే జరిగితే రుద్రాగౌడ్ విజయావకాశాలు బాగా తగ్గుతాయని ఎంపీ వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ఒక వేల గౌదుకు టిక్కెట్ ఇస్తే ఎ ఎన్నికలో అయన గెలిపించే బాధ్యతను కోట్ల తెసుకోవలిసి వస్తుంది. ఏమైనా ఎమ్మిగనూరు ఉప ఎన్నికలు ఎంపీ కోట్ల బలానికి, రాజకీయ బవిష్యత్తు పరీక్షగా మరబోతున్నాయి.


