TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రకోటకు 'కోట్ల'బెడద

Published on: Wed Mar 7, 2012 12:50PM

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు తాజా మాజీ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తన నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈయనను దెబ్బతీయాలని ఎంపి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎర్రకోటను మట్టి కరిపించి తన సత్తా ఏమిటి చూపాలన్న ధ్యేయంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట గతంలో కోట్ల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఆ తరువాత కోట్లను కాదని ఆయన ప్రత్యర్ధులతో చేతులు కలిపాడు. అనంతరం వైయస్ పక్షాన చేరి కోట్లకు మరింత ఆగ్రహాన్ని కలిగించాడు. వైయస్ చనిపోయిన తరువాత ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తన ప్రాధాన్యతను కోల్పోయాడు. ఈ నేపధ్యంలో ఎన్నికలకు వెళుతున్న ఎర్రకోటను మట్టి కరిపించాలన్న వ్యూహంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు.