TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మిగనూరు టు రాయచూరు..జేపీ సత్యాగ్రహ పాదయాత్ర

Published on: Sat Feb 18, 2012 9:51AM

కర్నూలు : లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శనివారం కర్నూలు జిల్లాలో రైతు సత్యాగ్రహ పాదయాత్రను చేపట్టారు. ఆయన ఎమ్మిగనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకూ కొనసాగనుంది. జయప్రకాష్ నారాయణ ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం ఉండాలన్నారు. పండించిన పంటను అమ్ముకోవటానికి ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయన్నారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. జేపీ యాత్రకు కాంగ్రెస్ నేత రుద్రగౌడ్ మద్దతు తెలిపారు.