కోనేరు కు షాకిచ్చిన సిబిఐ కోర్టు
Published on: Sat Feb 25, 2012 10:43AM
హైదరా
బాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కీలక నిందితుడు కోనేరు ప్రసాద్ కు సిబిఐ కోర్టు షాకిచ్చింది. కోనేరు బెయిల్ పిటిషన్ ను మూడోసారి సిబిఐ కోర్టు కొట్టివేసింది. అటు ఇదే కేసులో నిందితుడు విజయరాఘవన్ సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేశాడు. ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోనేరు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని వాదనలు వినిపించారు. ఎమ్మార్ కేవలం అర్దిక నేరం మాత్రమేనని, వేల కోట్ల స్కాం 2జీ లో నిందితులకు బెయిల్ ఇచ్చారని, అలాంటప్పుడు తన క్లయింట్ కు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసులో ఇప్పటికే చార్జీషీట్ దాఖలుచేసినందున బెయిల్ ఇవ్వాలని కోరారు. కోర్టు ఏ షరతులు విధించినా సిద్దమేనని, విచారణకు పూర్తిగా సహాకరిస్తాడని తెలిపారు. రాంజెఠ్మలాని వాదనలపై సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షాలను తారుమారు చేసే ప్రమాదముందని, తదుపరి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సిబిఐ లాయర్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోనేరు బెయిల్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన మరికొన్ని రోజులు జైలు లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


