2జి కి ఎమ్మార్ కి అంబటి లింక్
Published on: Sat Feb 4, 2012 8:14AM
హై
దరాబాద్: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుకు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి లింక్ పెట్టారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కూపంలోకి డిఎంకె నేత ఎ రాజాను నెట్టి పెద్దలు తప్పుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం పాపం యుపిఎదేనని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజాని బలి చేశారని ఆయన అన్నారు. వాస్తవానికి 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం బాధ్యత కేంద్ర మంత్రి వర్గానిదేనని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 74 ఆర్టికల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం నుంచి కేంద్ర హోం మంత్రి, అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని ఎలా తప్పిస్తారని ఆయన అడిగారు. కేంద్రం సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీయే కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మంత్రులను, రాజకీయ నాయకులను సిబిఐ వదిలేసిందని ఆయన అన్నారు.


