TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ భార్య భారతిపై సిబి'ఐ'

Published on: Fri Feb 17, 2012 1:52PM

  త్వరలో భారతి విచారణకు రంగం సిద్ధం
    తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం

 సిబిఐ వలలో  మరో పెద్ద చేప పడబోతోందా? ఎమ్మార్ ప్రాపర్టీ, జగన్ ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ తీరు తెన్నులు చూస్తుంటే అలగేననిపిస్తోంది. ఈసారి ఆ పెద్ద చేప జగన్ భార్య,జగతి పబ్లికేషన్ సంస్థ చైర్ పర్సన్ భారతి కావచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సిబిఐ ఆర్జెడి లక్ష్మీనారాయణ ఇప్పటికే తన దర్యాప్తులో భాగంగా అనేక సంచలన అరెస్టులు చేశారు. ఏవరూ ఊహించని విధంగా జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన సునీల్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. తరువాత టార్గెట్ భారతి ఔతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. సిబిఐ దర్యాప్తు జరుగుతుందనే మందస్తు సమాచారంతో జగన్ తన రహస్యం రికార్డుల్లో అనేకం అనామకుడిగా కనిపించే సునీల్ రెడ్డి వద్ద దాచారు. అయితే సిబిఐ సునీల్ రెడ్డి మిస్టరీని చేదించడంతో జగన్ షాక్ కు గురయ్యాడు. ఇతని అరెస్ట్ జరిగిన వెంటనే జగన్ ధైర్యం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతూ "ఇలా ప్రతిరోజూ వేధించేకన్నా ఒకేసారి చంపేయండి" అనే స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు సునీల్ రెడ్డి అరెస్ట్ ఎంతకీలకమైందో చెప్పడానికి. ఇదే సునీల్ రెడ్డి లక్ష్మినారాయణ మనసు కరగలేదు. నేరస్తులు మహిళలైన అరెస్టులు తప్పవని లక్ష్మీనారాయణ ఇప్పటికే నిరూపించారు. ఇప్పుడు భారతి విషయంలో కూడా ఇదే జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. భారతిని ఈ నెలాఖరులోగా విచారణకు పిలిపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. భారతి విచారణ ద్వారా జగన్ మనోధైర్యాన్ని ఉప ఎన్నికలకు ముందు గట్టిగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యం కూడా అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు తెలిసింది.