TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ!..

Published on: Wed Feb 23, 2022 1:23PM

అవును. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్’లో అప్రకటిత అత్యవసర పరిస్థితి ( ఎమర్జెన్సీ) అమలవుతోంది. రాష్టంలో ఎవరిని అడిగినా అందరి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. వైసీపీ ప్రభుత్వం, అణచివేతలనే నమ్ముకుంది. పోలీస్ పవర్’తో పరిపాలన సాగించాలని చూస్తోంది. అందుకే,  ఒక్కరొక్కరుగా  అన్నివర్గాల ప్రజలు నిరసన గళం విప్పుతున్నారు. వీధుల కెక్కుతున్నారు. నిరసనలు, ఆందోళనలతో ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోతోంది. అయినా, జగన్ రెడ్డి ప్రభుత్వం కర్ర పెత్తనం చేయాలనే చూస్తోంది. పోలీసులకు పనిచెప్పి, గళం విప్పిన వారి గొంతులు నొక్కేస్తోంది. అన్యాయమని అంటే అనుభవించక తప్పదనే విధంగా వ్యవహరిస్తున్నారు.   

గత రెండు రోజులగా, సోమ, మంగళ వారాలలో, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఒకరి వెంట ఒకరు వీధుల్లోకి వచ్చారు. నిజానికి అంగన్‌వాడీ కార్యకర్తలు గానీ, ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. జగన్ రెడ్డిపాద యాత్రలో, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ప్రామిస్ చేసిన విధంగా, కనీస వేతనాన్ని కాసింత పెంచి రూ.15 వేలుచేయమని కోరుతున్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.5 లక్షలు ఇవ్వమని అడుగుతున్నారు. కరోనాతో మృతి చెందిన ఆశా  కుటుంబాలకు 10 లక్షల సాయంవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కోరుతున్నాను. అలాగే, సంబంధం లేని పనులు వద్దు, కొవిడ్‌ టెస్టుల బాధ్యత నుంచి విముక్తిచేయమని కోరుతున్నారు. నిజానికి ఇవేవీ కూడ ఇప్పుడు వారు కొత్తగా కోరుతున్నవి కాదు. డిమాండ్ చేస్తున్నవీ కాదు. జగన్ రెడ్డి తనంతట తానుగా ఇస్తామని చెప్పినవే, అందుకే ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఒక్కసారి, వెనక్కి తిరిగి, పాద యాత్ర వీడియోలు చూసైనా, ఆరోజు ఏమి చెప్పావో గుర్తు చేసుకో జగనన్నా .. అని మాత్రమే అడుగుతున్నారు. 

అయినా ప్రభుత్వంలో చలనం లేదు. జగనన్నలో కదలిక లేదు. అందుకే, ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు.అయితే.. ఎక్కడికక్కడ పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేశారు. కొన్నిచోట్ల ముందస్తుగానే నిర్బంధించారు. వేల సంఖ్యలో ఆశా వర్కర్లను అరెస్టు చేశారు. అయినప్పటికీ.. ఆశా వర్కర్లు వెనుకంజ వేయకుండా ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కొందరు తమ పిల్లాపాపలతోనే ధర్నాల్లో పాల్గొన్నారు. వీరి ఉద్యమానికి పలు పార్టీలు మద్దతు పలికాయి. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయలేరని హెచ్చరించారు. 
‘ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. నేడు ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హామీలు నెరవేర్చాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు శాంతియుతంగా ఉద్యమిస్తే పోలీసుల్ని ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా అణచివేయడం నిరంకుశత్వం’’ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. నిజం, జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి నిరంకుశత్వాన్ని మరిపించేలా ఉందని ఆందోళనలో పాల్గొన్నమహిళలు ఆగ్రహం వయటం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పోలీసు స్టేషన్లకు తరలించిన పోలీసులు తమకు కనీస సదుపాయలు కూడా లేకుండా చేశారని, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ప్రభుత్వఉద్యోగులు,ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనను ఉద్యోగ సంఘాల నాయకులను అడ్డుపెట్టుకుని నీరు గార్చిన ప్రభుత్వం, అదే విధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్ల్ ఆందోళను, అలాగే, అన్ని వర్గాల్లో పెల్లుబుకుతున్న ఆందోళనను నీరు కార్చగలమని జగన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే, అది పొరపాటే అవుతుందని, అందుకు ప్రభుత్వంభారీ మూల్యం చెల్లించక తప్పదని సామాన్యులు హెచ్చరిస్తున్నారు.