Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ది అమెరికా పార్టీ.. మస్క్ కొత్త పార్టీ పేరు అదేనా?
posted on: Jun 7, 2025 1:38PM

ఇప్పటి వరకూ మస్క్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా జరిగిన పరిణామ క్రమం వేరు. 2024 ఎన్నికల్లో సుమారు 30 కోట్ల డాలర్లు.. (ఇండియన్ కరెన్సీలో 2500 కోట్లు) విరాళం ఇచ్చి మరీ రాజకీయాల్లోకి దిగిన మస్క్ కి జరిగిన శాస్తి ఏంటంటే.. ఆయన టెస్లా అమ్మకాలు భారీగా పడిపోవడం, షేర్ ధరలు యాభై శాతం డౌన్ కావడం, వంద బిలియన్ డాలర్ల మేర తన సంపద ఆవిరి కావడం.
అంతేనా ఆయన డోజ్ ప్రధాన సలహాదారుగా ఉండి కూడా అమెరికన్ల నుంచి భారీ ఎత్తున చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి లాభానికి బదులు నష్టం వాటిల్లడం కూడా ఆయన చవి చూశారు. అంతేనా తన ఫ్రెండ్ ఐజాక్ మాన్ ని నాసాకు చీఫ్ చేయాలన్న కలలు కూడా కల్లలయ్యాయి. ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక మస్క్ కి ఎదురు దెబ్బలే తగిలాయి తప్ప.. ఎలాంటి ప్రయోజనం చేకూరింది లేదు. పైపెచ్చు తాను దగ్గరుండి ప్రచారం చేసి అధికారంలోకి తెచ్చిన ట్రంప్ పాలన కారణంగా ఆయన టెస్లా అమ్మకాలు భారీగా పడిపోయి.. 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఒక రకంగా చెబితే ఎలాన్ మస్క్ కి రాజకీయాలు అంతగా కలసి రాలేదు సరికదా.. బ్యాడ్ బాయ్ గా ముద్ర అయితే బలంగా పడింది. మస్క్ వల్ల మా ఉద్యోగాలు పోయాయంటూ.. కొందరు ఆయన టెస్లా షోరూములపైనా దాడులకు పాల్పడ్డారు. ఒకటి కాదు లెక్కలేనన్ని నష్టాలు. విరాళాల రూపంలో వేల కోట్ల రూపాయలు నష్టం. ఆ తర్వాత డోజ్ అధికారక పదవి ద్వారా తన వ్యాపారానికి భారీ ఎత్తున నష్టాలు. అనుకున్న పనులు సాదించారా అంటే అదీ లేదు. పైపెచ్చు ప్రభుత్వంతో ఉన్న కాంట్రాక్టులు కూడా పోయేలా ఉన్నాయ్.
అంతేనా ఆయన ప్రస్తుతం న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజర్ గా చెబుతున్నారు. ఎందుకంటే దీని ద్వారా వెన్నుముక విరిగిన వారు నడవగలరు. కంటి చూపు లేని వారు చూడగలరు. ఇలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలతో బోలెడెంత వ్యాపారం చేసి.. మరింత మందికి ఉపాధి అవకాశాలను ఇవ్వగలరు మస్క్. తన తండ్రి ఎరోన్ మస్క్ కూడా నీకింకా ఏమంత వయసు ఐపోలేదు. ఇప్పటికి 53 ఏళ్లు మాత్రమే. నీకు రాజకీయాలకన్నా మానసిక ప్రశాంతత అవసరం. కాబట్టి భారత్ వచ్చి ఇక్కడి ఆలయాల్లో ఆధ్యాత్మిక ప్రశాంతత పొందు అంటూ సూచించారు కూడా.
కానీ అతడు మస్క్ కదా? ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకునే బాపతు. ఇటు ట్రంప్ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తూనే అటు.. తానే ఒక రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ మూడో ప్రత్యామ్నయం దిశగా థింక్ చేశారు మస్క్. ఎక్స్ లో తన 22 కోట్ల ఫాలోయర్ల ముందు తన ప్రతిపాదన ఉంచాడు.. 80 శాతం మంది సానుకూలంగా స్పందించారు. దీంతో మస్క్ మస్త్ కుషీ కావడమే కాకుండా.. ద అమెరికన్ పార్టీ అంటూ కూడా తన ఎక్స్ పోస్ట్ లో మరో కామెంట్ చేయడంతో ఇప్పుడు మస్క్.. కొత్త పార్టీ పెడుతున్నారా? అన్నదొక చర్చగా మారింది.
ఒక వేళ పెడితే రిపబ్లికన్లకు, డెమొక్రాట్లకు దీటుగా ఈ పార్టీ పని చేస్తుందా? ఆయా పార్టీల అనుభవం ముందు మస్క్ లాంటి వ్యక్తి ఎక్స్ పీరియన్స్ సరిపోతుందా? వ్యాపారం వేరు, రాజకీయాలు వేరు. ఇక్కడ రైట్ అక్కడ రాంగ్ అంటూ ఎన్నో ఈక్వేషన్లుంటాయి. వ్యాపారంలో లాభం చూడాలి. రాజకీయాల్లో నష్టాలను చవి చూడ్డమే ఒక లాభం. ఈ విషయంపై మస్త్ కి కనీస అవగాహన ఉందా? అంటే లేదనే చెప్పాలి.
అంత ఖరాకండిగా ఎలా చెప్పగలరు? అంటే మస్క్ అసలు ట్రంప్ మీద ఇంత వ్యతిరేకత నూరిపోయడానికి గల కారణమేంటి?. తనకు రాజకీయాల్లోకి వచ్చాక ఎదురైన వరుస నష్టాలు. అలాంటి నష్టాలను ఎలాగోలా తట్టుకుని నిలబడ్డారా? అంటే వెంటనే బయటకొచ్చాడు. ట్రంప్ మీద ఆరోపణలు గుప్పించాడు. ఆపై కొత్త పార్టీ అంటున్నారు. ఇది కరెక్టేనా? ఏ రాజకీయ పాలనా అనుభవం ఉందని మస్క్ ని ఎలా నమ్మాలి? మస్క్ పోల్ పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టేస్తారా? పెట్టి నెగ్గుకొస్తారా? అన్న చర్చ మొదలైంది. మరి చూడాలి ఎలా నెగ్గుకొస్తారో?






