TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బేరసారాలు ఆడాల్సిన అవసరం లేదు : లగడపాటి

Published on: Wed Jan 4, 2012 7:50AM

న్యూఢిల్లీ: ఉప ఎన్నికల కోసం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని అరెస్టు చేశారనడంలో నిజం లేదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్  మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్‌తో బేరసారాలు ఆడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.సమయం వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సహా అందరూ అరెస్టవుతారని అయన  అన్నారు. ఉద్యమం వల్ల నాయకులు లాభపడ్డారని, ప్రజలు నష్టపోయారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుల తీరుతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు.  ప్రజలకు నష్టం జరగకుండా ఉద్యమాలు చేస్తే ఎవరూ వ్యతిరేకించబోరని ఆయన అన్నారు.