విద్యుత్ పోరు భగ్నం..ఆరంభం మాత్రమేనన్న బాబు
Published on: Tue Jan 10, 2012 1:18PM
హైదరా
బాద్ : పెరిగిన విద్యుత్‌చార్జీలను నిరసిస్తూ టీడీపీ తలపెట్టిన విద్యుత్‌పోరును పోలీసులు భగ్నం చేశారు. సోమాజీగూడలోని విద్యుత్ సౌధ వద్ద టీడీపీ నిర్వహించే ధర్నాకు పాదయాత్రగా వెళుతున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును బంజారాహిల్స్ రోడ్‌నెం3 వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు టీడీపీకి చెందిన పలువురు అగ్రనేతలను కూడా అరెస్ట్ చేశారు. బాబుతో సహా వారందరినీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రజా పక్షాన ఉండి పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం ఏమేరకు సమంజసమని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు.ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ సర్కారు గద్దె దిగాల్సిందేనని ఆయన అరెస్ట్ అయిన అనంతరం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యపై ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని ఆయన చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు వల్ల ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. రూ.16వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబు అరెస్ట్ సందర్భంగా బంజారాహిల్స్, సోమాజీగూడ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.


