TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో ఎమ్మెల్సీ సమరం

Published on: Fri May 31, 2019 11:17AM

 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ జరుగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఈ మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్‌), వరంగల్‌ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (కాంగ్రెస్‌), నల్లగొండలో తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్) కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిపి మొత్తం 2,799 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జూన్‌ 3న జరుగుతుంది.