రాహుల్‌పై షూ విసిరిన దుండగుడు,అరెస్ట్
Published on: Tue Jan 24, 2012 8:38AM
ఉత్తరఖం
డ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా డెహ్రాడూన్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, ఎంపీ రాహుల్‌గాంధీపైకి ఓ దుండగుడు షూ విసిరాడు. డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. షూ విసిరిన దుండగున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ సంఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సంఘటన తనపై ఏ విధమైన ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లో బిజెపి బలంగా ఉంటుంది.ఉత్తరాఖండ్‌లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రచారం సాగించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర శానససభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు.


