TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద్వేషాన్ని రెచ్చగొట్టేవారు ఎన్నికలలో గెలుస్తున్నారు

Published on: Mon Mar 28, 2016 4:40PM

 

కొందరు నేతలు, సున్నితమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ సదరు వ్యక్తులు ఏవో భావోద్వేగంతో అలాంటి ప్రసంగాలను చేస్తున్నారనుకోవడం పొరపాటే అంటున్నారు మనోజ్‌ అనే సామాజిక కార్యకర్త. గత 12 సంవత్సరాలుగా ఎన్నికల తీరుని విశ్లేషించిన మనోజ్‌, తన పరిశీలన ఆధారంగా ఓ సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టిన వారిలో మూడో వంతు మంది ఎన్నికలలో గెలుపొందుతున్నట్లు తేల్తోంది.

 

అంతేకాదు! ద్వేషపూరిత ప్రసంగాలు చేసి విచారణను ఎదుర్కొంటున్న వారిలో 70 మంది ప్రస్తుత చట్టసభల్లోనే ఉన్నారట. వీరిలో సాక్షి మహరాజ్, అజంఖాన్‌, అక్బరుద్దీన్‌ ఓవైసీ వంటి ఉద్ధండులూ ఉన్నారు. పోనీ ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తులను పార్టీలన్నా దూరంగా ఉంచుతున్నాయా అంటే అదేమీ లేదంటున్నారు మనోజ్‌. ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కేసులను ఎదుర్కొంటున్న 399 మందికి గత 12 ఏళ్లలో వివిధ పార్టీలు టిక్కెట్లిచ్చి సత్కరించాయట. అంటే ద్వేషంతో ప్రజల మనసుని విరిచి, పదవి గెలుచుకునే ప్రయత్నాలు బలపడుతున్నాయన్నమాట! తస్మాత్‌ జాగ్రత్త.