ప్రీ ఫైనల్స్‌ కు రెడీ

 

త్వరలో జరగభోయే పార్లమెంట్‌ ఎలక్షన్స్‌ కి ప్రీఫైనల్స్‌ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్‌ కు నగారా మోగింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాలకు సంభందించిన ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది.

 

నాలుగు రాష్ట్రాల్లో ఒకదశలోనే పోలింగ్‌ పూర్తిచేయనున్నట్టుగా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఛత్తీస్‌గడ్‌లో మాత్రం రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తుంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నేటినుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది.

 

ఐదు రాష్ట్రాల్లో మొత్తం, 11 కోట్ల మంది ఓటర్లు ఉండగా, లక్షా 30 వేల పోలింగ్‌ బూతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్షన్లలో తొలిసారిగా తిరస్కరణ ఓటు సదుపాయం కల్పిస్తామని, నామినేషన్ పత్రాలలో ఖాళీలు వదిలితే తిరస్కరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.