TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ ను ఉరి తీసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు

Published on: Sun Jan 8, 2012 2:38PM

నెల్లూరు:  ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఉరి తీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అన్నారు. తమ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై యెల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని  ఇలాంటి అసత్య ప్రచారం మానుకోకుంటే ప్రజలే వారికి గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. కాగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న మహా పాదయాత్రకు బ్రేక్ పడింది. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటంరెడ్డి తన మహాపాదయాత్రకు బ్రేక్ వేశారు. త్వరలో జరగనున్న కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికలకు కోటంరెడ్డిని పరిశీలకుడిగా వెళ్లాలని జగన్ ఆదేశించారు. అనంతరం తిరిగి వచ్చాక మళ్లీ జనవరి 21వ తేది నుండి మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది.