TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపఎన్నికలు కాదు 2014 ఎన్నికలే రిఫరెండం: సీఎం

Published on: Mon Jan 2, 2012 8:06AM

హైదరాబాద్‌ :ప్రస్తుత ఉప ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నందున రిఫరెండం కాదన్నారు.2014 ఎన్నికలే తమ సర్కారు పనితీరుకు రెఫరెండమని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఉప ఎన్నికలకు వెళుతామని చెప్పారు.సరైన సమయంలో అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు.అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటికి దించుతుందన్నారు.  త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యభద్రత కల్పించే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో వైద్యుల కొరత తీర్చేందుకు కొత్త విధానాన్ని అమలు చేస్తామని సీఎం వివరించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లే వారి స్థానంలో ఒప్పందం ప్రాతిపదికన వైద్యులను నియమించబోతున్నట్టు సీఎం ప్రకటించారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా విలీనం కాలేదని వాస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి వర్గ స్థానంలో పీఆర్పీ వారికి స్థానం లభిస్తుందన్నారు.చిరంజీవిని, అధిష్టానాన్ని సంప్రదించాకే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్నారు. మంత్రివర్గంలోకి ఎవరి పేరు ప్రతిపాదించినా అసంతృప్తి సహజమేనన్నారు.