విప్‌ని ధిక్కరించిన వారే అభ్యర్థులు :జగన్
Published on: Sat Dec 31, 2011 8:03AM
హైదరాబా
ద్ : ఉపఎన్నికల్లో తమ పార్టీ అనుసరించే విధానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపీ వైఎస్ జగన్ తెలిపారు.తమ పార్టీ మొత్తం 18 స్థానాల్లో పోటీచేస్తుందని అయన చెప్పారు. రైతుల కోసం విప్‌ని ధిక్కరించిన ఎమ్మెల్యేలే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. రాజీనామా చేసిన పీఆర్పీ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తమ పార్టీనుంచి పోటీ చేస్తోందని అన్నారు.టిడిపి కుమ్మక్కు విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా తమ పార్టీ నుంచి పోటీచేస్తారని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. బలమైన ఆకాంక్షతో వారు పదవులు వదులుకున్నారని, వారిని గౌరవించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. ఇటీవల ఆకాల మరణం చెందిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి సతీమణిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటిచేయమని కోరుతున్నామని అన్నారు. ఒకవేళ ఆమె వేరే పార్టీ నుంచి పోటీచేసినా, ఆమెపై పోటీ పెట్టమని జగన్ స్పష్టం చేశారు.


