ఏపీలో ఎవరిది విజయం.. క్షణక్షణం అప్ డేట్స్...

 

  • 23:39 ఏపీ లోక్ సభ ఎన్నికల పోరులో.. వైసీపీ 22, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి.

  • 23:34 ఏపీ అసెంబ్లీ తుది ఫలితాలు.
    వైసీపీ 150, టీడీపీ 24, జనసేన 1 స్థానాల్లో విజయం సాధించాయి.

  • 22:52 కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్‌ విజయం సాధించారు.

  • 22:49 విజయవాడ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని.. వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌ వి.పొట్లూరిపై విజయం సాధించారు.

  • 22:12 నంద్యాల, విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడ, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం.

  • ఎట్టకేలకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు.

  • గన్నవరంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 820 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి వరకూ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ సాగగా, విజయం వంశీని వరించింది.

  • 19:28 ‘ఎన్నికల్లో విజయం సాధించిన  ప్రధాని మోదీ, వైఎస్ జగన్ లకు శుభాకాంక్షలు. టీడీపీ విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ ధన్యవాదాలు. ఓటమిపై విశ్లేషించుకుంటాం’ - చంద్రబాబు.

  • 19:24 మచిలీపట్నం, ఏలూరు లోక్‌సభ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, కోటగిరి శ్రీధర్‌లు విజయం.

  • 19:18 ఈ నెల 30 న తిరుపతి తారకరామ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం.

  • 19:15 సెంచరీ కొట్టిన వైసీపీ.
    ఇప్పటివరకు వైసీపీ 102 స్థానాలను గెలుచుకుంది. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
    టీడీపీ ఇప్పటివరకు 12 స్థానాలు గెలుచుకుంది. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 19:07 ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి విజయం సాధించారు.

  • 19:03 ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా. గవర్నర్ ఆమోదం.

  • 19:00 విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం.

  • 18:53 మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు.

  • 18:53 హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయం.

  • 18:48 వైసీపీ అభ్యర్థులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పర్వత శ్రీ పూర్ణ చంద్రరావు (ప్రత్తిపాడు), చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మిగనూరు)లో విజయం సాధించారు.

  • 18:47 గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని విజయం.

  • 18:46 వైసీపీ అభ్యర్థులు బాల నాగిరెడ్డి (మంత్రాలయం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), గుమ్మనూరు జయరాం (ఆలూరు) విజయం సాధించారు.

  • 18:45 విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం.

  • 18:43 ఈ నెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం: వైఎస్ జగన్

  • 17:57 మంగళగిరిలో నారా లోకేష్ ఓటమి.

  • 17:56 వైసీపీ అభ్యర్థులు టీజేఆర్‌ సుధాకర్‌బాబు (సంతనూతలపాడు), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం), సిద్దారెడ్డి (కదిరి), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం)లో విజయం సాధించారు.

  • 17:55 గన్నవరం ఫలితంపై ఉత్కంఠ
    కృష్ణా జిల్లా గన్నవరం ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ 712 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఇంకా 3 ఈవీఎంలు, 400 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి రావడంతో ఇరు పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది.

  • 17:53 టీడీపీ అభ్యర్థులు నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), అనగాని సత్య ప్రసాద్‌ (రేపల్లె)లో విజయం సాధించారు

  • 17:16 పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన పవన్ కళ్యాణ్.

  • 16:33 దెందులూరులో చింతమనేనిపై వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి గెలుపు.
    చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు.

  • 16:29 పులివెందులలో వైఎస్ జగన్ 90 వేల మెజారిటీతో ఘన విజయం.
    టెక్కలిలో మంత్రి అచ్చన్నాయుడు విజయం.

  • 15:53 కృష్ణాజిల్లా అవనిగడ్డలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు విజయం.
    చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి 33,700 ఓట్ల మెజారిటీతో గెలుపు.
    పులివెందులలో 70 వేల ఆధిక్యంలో జగన్.
    మంగళగిరిలో నారా లోకేష్ పై వైసీపీకి 8 వేల ఓట్ల ఆధిక్యం.
    గన్నవరంలో వల్లభనేని వంశీపై వైసీపీ 300 ఓట్లు లీడ్.

  • 15:11 కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 30 వేల మెజారిటీతో గెలుపు.

  • 14:28 రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి లక్ష మెజారిటీతో ఘన విజయం.
    ఏపీలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. మిగిలిన 24 స్థానాల్లోనూ వైసీపీనే ఆధిక్యంలో ఉంది.

  • 14:21 అరకులో టీడీపీ అభ్యర్థి కిడారి శ్రావణ్ తో సమానంగా నోటాకు ఓట్లు.
    అరకులో కిడారి శ్రావణ్ కంటే ఇండిపెండెంట్ లే కాస్త కూస్తో ప్రభావం చూపారు.

  • 12:37 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 148, టీడీపీ 27 స్థానాల్లో ఆధిక్యం.
    టీడీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు:
    వైజాగ్ ఈస్ట్, వైజాగ్ వెస్ట్, వైజాగ్ సౌత్
    పెద్దాపురం, రామచంద్రాపురం, ముమ్మిడివరం
    మండపేట, రాజమండ్రి సిటీ,రాజమండ్రి రూరల్, పర్చూరు
    అద్దంకి, చీరాల, కందుకూరు, హిందూపురం
    ఇచ్చాపురం, పాతపట్నం, కుప్పం, తాడికొండ, రేపల్లె
    గుంటూరు వెస్ట్, తిరువూరు, కైకలూరు, విజయవాడ ఈస్ట్.

  • 11:59 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 152, టీడీపీ 22, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    ఏపీ లోక్ సభ పోరులో వైసీపీ 23, టీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యం. విశాఖ ఉత్తరంలో మంత్రి గంటాపై వైసీపీ 500 లీడ్.

  • 11:57 ఈరోజు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్న చంద్రబాబు.
    గెలుపు ఖాయమని తేలడంతో.. ఫోన్ లో విశాఖ శారద పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్న జగన్.
    ఈ నెల 30 న జగన్ ప్రమాణ స్వీకారం.

  • 11:53

    ఏపీలో జగన్ కి ఒక్క ఛాన్స్ అనే మంత్రం బాగా పనిచేసింది.
    టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బాబు కొంపముంచింది.
    బాబు చేసిన అభివృద్ధిని కూడా మర్చిపోయేలా చేసిన కొందరు ఎమ్మెల్యేల తీరు.
    జనసేనను సీరియస్ గా తీసుకోని ఏపీ ప్రజలు.

    గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్ డేట్.
    చిలకలూరిపేట మంత్రి ప్రత్తిపాటిపై వైసీపీ 236 లీడ్.
    నర్సారావుపేట వైసీపీ 5000 లీడ్.
    సత్తెనపల్లి కోడెలపై అంబటి 4000 లీడ్.
    మాచర్ల వైసీపీ 5000 లీడ్.
    తాడికొండ టీడీపీ 2000 లీడ్.
    మంగళగిరిలో నారా లోకేష్ పై వైసీపీ 5000 లీడ్.
    పొన్నూరులో వైసీపీ 1700 లీడ్.
    వేమూరు మంత్రి నక్కాపై వైసీపీ 5000 లీడ్.
    రేపల్లె టీడీపీ 5000 లీడ్. (ఎన్నికలకు ముందు ఇక్కడ టీడీపీ అభ్యర్థిని గెలిపించమని కోరిన హీరోయిన్ సమంత.)
    తెనాలి వైసీపీ 1500  లీడ్.
    బాపట్ల వైసీపీ 4500 లీడ్.
    పత్తిపాడు వైసీపీ 9000 లీడ్.
    గుంటూరు వెస్ట్ టీడీపీ 1400 లీడ్.
    గుంటూరు ఈస్ట్ టీడీపీ 1200 లీడ్.

  • 11:37 కృష్ణ జిల్లా లేటెస్ట్ అప్ డేట్.
    పామర్రు లో వైసీపీ 10 వేలు లీడ్.
    పెనమలూరు వైసీపీ 640 ఓట్ల లీడ్.
    విజయవాడ వెస్ట్ వైసీపీ లీడ్.
    విజయవాడ సెంట్రల్ వైసీపీ 450 లీడ్.
    విజయవాడ ఈస్ట్ వైసీపీ లీడ్.
    మైలవరంలో వైసీపీ 950 లీడ్.
    నందిగామ వైసీపీ 800 లీడ్.
    జగ్గయ్యపేట వైసీపీ 1000 లీడ్.
    తిరువూరులో టీడీపీ లీడ్.
    గుడివాడలో కొడాలి నాని 2600 లీడింగ్.
    నూజివీడులో వైసీపీ 1000 లీడ్.
    గన్నవరంలో టీడీపీ 1000 లీడ్.
    కైకలూరు టీడీపీ 2000 లీడ్.
    పెడన వైసీపీ 2700 లీడ్.
    అవనిగడ్డ 3400 వైసీపీ లీడ్.

  • 11:27 జగన్ 18000 లీడింగ్. లోకేష్ 2000 ఓట్లు వెనుకంజ.
    గాజువాకలో పవన్ ముందంజ. గుడివాడలో కొడాలి నాని 2600 లీడింగ్.

  • 11:11 ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ముందంజ.
    గాజువాకలో పవన్ ముందంజ.
    కర్నూల్ లో వైసీపీ 34 ఓట్ల లీడ్.
    పాణ్యంలో వైసీపీ 1000 ఓట్ల లీడ్.
    నంద్యాలలో వైసీపీ 1456 లీడ్. ఆలూరులో కోట్ల సుజాతమ్మ వెనుకంజ

  • 11:07 ఆళ్లగడ్డలో అఖిల ప్రియ వెనుకంజ. వైసీపీ 2000 లీడ్.

  • 10:55 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 150, టీడీపీ 24, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    మంత్రి సోమిరెడ్డి వెనుకంజ. గుడివాడలో కొడాలి నాని ముందంజ. తాడేపల్లిగూడెంలో వైసీపీ లీడ్.

  • 10:48 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 149, టీడీపీ 21, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    ఏపీ లోక్ సభ పోరులో వైసీపీ 18, టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:44 మైలవరంలో దేవినేని వెనకంజ, గన్నవరంలో వల్లభనేని ముందంజ. చీరాల టీడీపీ లీడ్. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల ముందంజ.
    హిందూపురంలో బాలయ్య, నగరిలో రోజా ముందంజ.

  • 10:42 అనంతపురంలో వైసీపీ 12, టీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:37  కర్నూల్ జిల్లాలో వైసీపీ 13, టీడీపీ 1 స్థానాల్లో ఆధిక్యం.
    రాజమండ్రి లోక్ సభ వైసీపీ లీడ్.

  • 10:32 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 140, టీడీపీ 30, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    ఏపీ లోక్ సభ పోరులో వైసీపీ 18, టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యం.
    వెనుకంజలో పలువురు టీడీపీ మంత్రులు.
    కడప జిల్లాలో వైసీపీ 10 స్థానాల్లో ఆధిక్యం.

  • పొన్నూరులో దూళిపాళ్ల నరేంద్ర వెనుకంజ.

  • 10:21  సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వెనుకంజ
    పర్చూరులో దగ్గుబాటి వెనుకంజ.

  • 10:19 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 134, టీడీపీ 30, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    ఏపీ లోక్ సభ పోరులో వైసీపీ 15, టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:08 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 130, టీడీపీ 29, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    విశాఖలో టీడీపీ 1, వైసీపీ 11 స్థానాల్లో ఆధిక్యం.
    తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ 10, టీడీపీ 6, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:05 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 128, టీడీపీ 29, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం.
    గుంటూరు జిల్లాలో టీడీపీ 6, వైసీపీ 10 స్థానాల్లో ఆధిక్యం.

  • 9:58 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 124, టీడీపీ 27, జనసేన 1 స్థానాల్లో ఆధిక్యం. లోక్ సభ పోరులో వైసీపీ 11 , టీడీపీ 6 స్థానాల్లో ఆధిక్యం.

  • 9:47 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 102, టీడీపీ 23, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యం.

  • 9:43 మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ

  • 9:41 ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 101, టీడీపీ 23 స్థానాల్లో ఆధిక్యం.

  • 9:36 పరిటాల శ్రీరామ్ బరిలో నిలిచిన రాప్తాడులో వైసీపీ ముందంజ

  • 9:33 గాజువాకలో వైసీపీ ముందంజ

  • 9:30 కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 357 ఓట్ల వెనుకంజ

  • పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరావు వెనుకంజ

  • ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 70, టీడీపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • ఎన్నికల కౌటింగ్ మొదలైంది. ఊహించని అద్భుతాలు ఏమి జరగట్లేదు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే.. కేంద్రంలో ఎన్డీయే కూటమి, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి.ప్రస్తుతమున్న ఆధిక్యాలను పరిశీలిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 257, యూపీఏ కూటమి 105, ఇతరులు 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 48, టీడీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే టీఆర్ఎస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.