కేంద్రంలో.. కమలమా? కూటమా?. క్షణక్షణం అప్ డేట్స్...

 

  • 23:47 సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు.
    ఎన్డీయే 348, యూపీఏ 86, ఇతరులు 108 స్థానాల్లో విజయం.

  • తెలంగాణ లోక్ సభ తుది ఫలితాలు.
    టీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో విజయం సాధించాయి.

  • 19:09 యూపీలోని గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ (రేసుగుర్రం సినిమాలో విలన్ రోల్) 3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 18:40 తెలంగాణ లోక్ సభ ఫలితాలు.
    చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం.

  • 18:37  మోదీకి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు.
    ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తా.. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదు: రాహుల్.

  • 17:47 అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి. 24,404 ఓట్లతో స్మృతీ ఇరాణి విజయం

  • 17:26

    నిజామాబాద్ లో కవితపై బీజేపీ అభ్యర్థి డి. అరవింద్ 68 వేల మెజారిటీతో గెలిచారు.
    సికింద్రాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిపై.. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపొందారు.

  • 16:41 దిగ్విజయ్ సింగ్ పై బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ గెలుపు.

  • 16:13 కేరళలోని వాయనాడ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు 8 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
    భారత ఎన్నికల చరిత్రలో ఓ అభ్యర్థి ఇంత మెజారిటీతో గెలవడం ఇదే తొలిసారి.

  • 14:50 మల్కాజగిరి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం.

  • 14:44 చేవెళ్ల లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం.
    మహబూబ్ నగర్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి విజయం.
    కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం.

  • 14:26 ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు.

  • 14:16 నల్గొండలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 19,070 ఓట్ల మెజారిటీతో గెలుపు.

  • 14:12 గాంధీనగర్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా ఘన విజయం

  • 14:06

    తెలంగాణ లోక్ సభ ఫలితాలు.
    భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి విజయం.
    భువనగిరిలో చెల్లని నాణెమే గెలిచింది.
    అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
    దీంతో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అక్కడ చెల్లని నాణెం ఇక్కడ చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. కానీ చివరికి కేటీఆర్ చెల్లదని చెప్పిన నాణెమే ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ కు షాకిచ్చింది.

  • 12:56 ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. టీఆర్ఎస్ 'సారు.. కారు.. పదహారు' కాస్తా 'సారు.. కారు.. అర్థ పదహారు(8)' గా మారిపోయేలా ఉంది.
    నల్గొండ, భువనగిరి, చేవెళ్ల, మల్కాజగిరి స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.
    నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.

  • 12:30 తెలంగాణలో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం.
    నిజామాబాద్ లో కవిత పై బీజేపీ 40 వేలకు పైగా ఆధిక్యం.
    సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి 30 వేలు ఆధిక్యం.
    నల్గొండలో ఉత్తమ్ 15 వేలు ఆధిక్యం.
    భువనగిరి, చేవెళ్లలో కాంగ్రెస్ ఆధిక్యం.
    కరీంనగర్ లో బండి సంజయ్ 70 వేలు ఆధిక్యం.

  • 12:03 బెంగళూరులో ప్రకాష్ రాజ్ వెనుకంజ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ జోరు.

  • 11:20 వారణాసిలో ప్రధాని మోదీ లక్ష ఓట్ల ముందంజ.
    వాయనాడ్ లో రాహుల్ గాంధీ లక్ష ఓట్ల ముందంజ.
    అమేథీలో రాహుల్ పై స్మృతి ఇరానీ లీడ్.
    సికింద్రాబాద్ కిషన్ రెడ్డి 15000 ఓట్ల లీడ్.
    ఉత్తరప్రదేశ్ లోక్ సభ పోరులో ఎస్పీ+బీఎస్పీ 25, బీజేపీ 53 స్థానాల్లో, ఇతరులు 2 ఆధిక్యం.

  • 11:00  తెలంగాణలో టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం. మల్కాజగిరిలో రేవంత్ రెడ్డి ముందంజ.

  • 10:52 తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్.
    టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:31 తెలంగాణ లోక్ సభ పోరులో చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా ఆధిక్యం.
    పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 25, బీజేపీ 15, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:25 తెలంగాణలో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 1, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం
    కర్ణాటకలో బీజేపీ 21, కాంగ్రెస్+ 7 స్థానాల్లో ఆధిక్యం
    బీహార్ లో బీజేడీ 11, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యం.

  • 10:15 తెలంగాణలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1, బీజేపీ 3, ఎంఐఎం 1 స్థానాల్లో ఆధిక్యం
    తెలంగాణ లోక్ సభ పోరులో సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యం.ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు ఆధిక్యం. బీహార్ లో బీజేపీ+ 37, కాంగ్రెస్+ 3 స్థానాల్లో ఆధిక్యం. తమిళ నాడులో డీఎంకే+: 36, ఏఐడీఎంకే+: 2

  • 10:03 తెలంగాణలో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 1, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానాల్లో ఆధిక్యం
  • 10:01 పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 19, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యం
  • 9:45 ఎన్డీయే కూటమి 311, యూపీఏ కూటమి 108, ఇతరులు 98 స్థానాల్లో ఆధిక్యం.
  • 9:30 ఎన్డీయే కూటమి 294, యూపీఏ కూటమి 102, ఇతరులు 91 స్థానాల్లో ఆధిక్యం.
  • ఎన్నికల కౌటింగ్ మొదలైంది. ఊహించని అద్భుతాలు ఏమి జరగట్లేదు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే.. కేంద్రంలో ఎన్డీయే కూటమి, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతమున్న ఆధిక్యాలను పరిశీలిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 257, యూపీఏ కూటమి 105, ఇతరులు 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ అసెంబ్లీ పోరులో వైసీపీ 48, టీడీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే టీఆర్ఎస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.