ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!
Published on: Tue Feb 2, 2016 6:29PM

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్ నగరపాలిక ఎన్నికలు ఎట్టకేళకు ముగిసాయి. దాదాపు 45 శాతం
చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగానే ముగిసిందంటూ ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. లంగర్‌హౌజ్ వద్ద బీజేపీ- టీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట చోటుచేసుకుంది. ఇక అజంపురాలోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ నివాసం మీద మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయడంలో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మరోవైపు సమస్యాత్మకంగా భావించే పాతబస్తీలోనూ కొంత ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలోని మీర్‌చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్- మజ్లిస్ పార్టీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి.


