TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విథి నిర్వహణలో వెనుకబడ్డ ఈసి?

Published on: Fri Jun 8, 2012 9:41AM

Election Commission of India, AP by polls Election Commission, AP by elections EC, EC ap by polls 2012రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఈసి) తన విధినిర్వహణలో వెనుకబడింది. ఇది ఒకరిమాట కాదు. ఎన్నికల కమీషన్ విడుద్కాల చేసిన గణాంకాలే ఈ విధయాన్ని చాటుతున్నాయి. హైటెక్ స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు చేయటంలో సఫలీకృతమైన ఈసి ఫిర్యాదుల విషయంలో నత్తకు నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ఆదేశించిన ఈసి వాటి పర్యవేక్షణలో ఉదాసీనత ప్రదర్శించింది. లేకపోతే అభ్యర్థులు లోపాయికారిగా చేసే ఎన్నికల ఖర్చుతో పోలిస్తే చెక్ పోస్టుల ద్వారా కేవలం 25 శాతం మాత్రమే రాబట్టగలిగింది. అంటే, రూ. 5కోట్ల లోపే లెక్కల్లోకి రాణి డబ్బును పోలీసులు పట్టుకుంటే అది తమ ఘనతగా చాటుకుంది. ఈసి కేవలం చెక్ పోస్టులు ఏర్పాటు చేయమని మాత్రమే ఆదేశాలిచ్చింది. దాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించి ఉంటే అభ్యర్థులు చేసే ఖర్చులో 50శాతమైనా (రూ.100కోట్లు) లెక్కల్లో చూపని డబ్బు ప్రభుత్వానికి చేరేదని విశ్లేషకులు తేలుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఫిర్యాదులు చేసిన పార్టీగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఆ పార్టీ నాయకులు దాదాపు 98 ఫిర్యాదులు చేశారు. వీరి తరువాతి స్థానంలో తెలుగుదేశం ఉంది. దేశం 45 ఫిర్యాదులు, అధికార కాంగ్రెస్ 13 ఫిర్యాదులు చేశాయి.



ఫిర్యాదుల పరిష్కారంలోనూ ఈసి ఎక్కువగా  చొరవ చూపలేదు. వై.ఎస్.ఆర్. కాంగెస్ ఫిర్యాదుల్లో 48, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల్లో 21, కాంగ్రెస్ ఫిర్యాదుల్లో 8 పరిష్కరించింది. మొత్తం 275 ఫిర్యాదులు వస్తే వాటిలో కేవలం 117 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. మొత్తం 149 జిల్లాల నుంచి తమకు సమాచారం అందలేనందున ఏమీ చేయలేకపోయామని ఈసి చేతులు కూడా ఎత్తేసింది.  9 కేసులు కేంద్ర ఎన్నికల సంఘంలో పెండింగ్ ఉన్నాయని గట్టిగా చెబుతోంది. ఇటీవల మహిళలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బంగారం పంపిణీకి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. బంగారం కొనుగోళ్ళు దాదాపు 50కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్నా 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి బంగారం రికవరీ రూ.12కోట్లు ఉంటుందని అంచనా. ఈసి ఆదేశాల మేరకు పోలీసులతో పాటు ఆదాయపన్ను శాఖ చురుకుగా వ్యవహరించిందని కితాబులు వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో కీలకవ్యక్తులు, జాతీయనేతలు, మంత్రులు ఉపన్యాసం చేసిన వారం తరువాతే నోటీసు అందజేసిన ఘనత మన రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు దక్కింది.