దేశ చరిత్రలో ఈసీ అలా చేయడం ఇదే మొదటిసారి

 

అమిత్ షా ర్యాలీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల నడుమ తీవ్ర ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ అనగా ఈరోజు రాత్రి 10 గంటల నుండి బెంగాల్‌లో ఎన్నికలు జరగాల్సిన తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధిస్తూ ఆర్టికల్ 324ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇలా గడువు ముగియడానికి ఒకరోజు ముందుగానే ఒకేసారి తొమ్మిది నియోజగవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిషేధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్నో క్లిష్టమైన ఎన్నికల్ని చూసిన ఈసీ ఇంతవరకు ఆర్టికల్ 324ను అమలుచేసింది లేదు.