TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండి సంజయ్ పై కేసు కొట్టివేత

Published on: Mon Jun 16, 2025 4:38PM

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం  (జూన్ 16) కొట్టివేసింది.  2021 నవంబర్ 15న ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా భారీ కాన్వాయ్ తో ర్యాలీ నిర్వహించారని అప్పట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు   పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచీ ఈ కేసు

2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.ఈ కేసు హైదరాబాద్ లోని ప్రజాప్రతినిథుల కోర్టులో పెండింగ్ లో ఉంది.  ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ బండి సంజయ్  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ కేసు కొట్టేయాల్సిందిగా ఆదేశిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.