రెండు రైళ్లు ఢీ.. నుజ్జునుజ్జయిన బోగీలు...


ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. స్థానిక కెనాల్‌ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్‌ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్‌ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 180 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.