ఆడిటర్ చక్రపాణి హత్యకేసు నీరుగార్చే యత్నం
Published on: Mon Mar 19, 2012 11:32AM
విజయవాడలో ఆంధ్రపత్రికకు సంబంధించిన సుమారు 4800 చదరపు గజాల స్థలం విషయంలో హత్యకు గురైన ఆడిటర్ వామరాజు చక్రపాణి హత్యకేసును కడపజిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సుమారు రూ. 16 కోట్ల విలువైన ఈ స్థలం కొనుగోలుకు సంబంధించి ఏర్పడిన వివాదంలో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మేనల్లుడు తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డి, మరికొందరికి సంబంధం ఉంది. ఈ స్థలాన్ని కొనుగోలుచేసిన వ్యక్తుల్లో వరదరాజులురెడ్డి తనయుడు కొండారెడ్డి కూడా ఉన్నాడు. తన బంధువులు ఈ కేసులో ఉండడంతో వరదరాజులురెడ్డి వారిని తప్పించి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు దీనికై ఆయన హైదరాబాద్ లో కొద్దిరోజులు మకాంవేసి ప్రభుత్వ పెద్దల సహకారం అర్ధించినట్లు తెలిసింది.


