TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు

Published on: Wed Jun 1, 2022 3:43PM

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న వారిరువురూ ఈటీ ఎదుట హాజరు కావాలన్నది ఆ సమన్ల సారాంశం.

కాగా రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన 8వ తేదీన ఈడీ ఎదుట హాజరు అయ్యే అవకాశం లేదు. అయితే సోనియా గాంధీ మాత్రం ఈడీ ఎదుట హాజరౌతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాహుల్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈడీ ఎదుట హాజరౌతారని అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు.

కాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో  సోనియా, రాగుల్ వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పవన్ బన్సాల్, మల్లిఖార్జున ఖర్గేలను ఈడీ ఇటీవల  ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ మండి పడింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకే కేంద్రం ఉపయోగించుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా, పంజరంలో చిలుకలుగా మారిపోయాయని కాంగ్రెస్ దుయ్యపడుతోంది.   కాంగ్రెస్ పై కేంద్రం కక్ష సాధింపు ధోరణికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు తాజా ఉదాహరణ అని కాంగ్రెస్ సీనియర్ నాయకడు రణదీప్ సింగ్ సూర్జివాలా విమర్శించారు.