హేమంత్ సొరేన్ స‌న్నిహితుల నివాసాల‌పై ఇ.డి. దాడులు

posted on: Jul 8, 2022 3:16PM

ఝార్ఖండ్‌లో ఒక మైనింగ్ లీజు త‌న‌ప‌రం చేసుకోవ డానికి, అలాగే ఒక ప్లాట్ ఆయ‌న భార్య‌పేరున రిజిష్ట‌ర్ చేయించుకున్నార‌న్న అవినీతి అభియోగాల‌ను సొరేన్ ఎదుర్కొంటున్న స‌మ‌యంలో శుక్ర‌వారం ఇ.డి. దాడులు జ‌రిగేయి. ఇ.డి. ఝార్ఖండ్‌లో మొత్తం 17 ప్రాంతాల్లో ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి సోరేన్ స‌న్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంక‌జ్ మిశ్రా సంబం ధించిన నివాసాల‌పై దాడులు చేప‌ట్టింది. 

అయితే ఈ దాడులు మిశ్రాపై తాజాగా రిజిస్ట‌ర్ అయిన నిధుల దుర్వినియోగం పై శుక్ర‌వారం ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట‌ర్ అయింది. దీని  ఆధారంగానే  ఈ దాడులు సాహిబ్‌గంజ‌, బార్హాత్‌, రాజ‌మ‌హ‌ల్ ప్రాంతాల్లో చేప ట్టామ‌ని ఇ.డి. అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకి, రాష్ట్ర మైనింగ్ శాఖ కార్య‌ద‌ర్శి పూజా సింఘాల్ పై వున్న కేసుకీ సంబంధం లేద‌న్నారు. కొత్త‌గా రిజిస్ట‌ర్ అయిన కేసు 2020 జూన్ లో సాహిబ్‌గంజ్ బ‌ధ్వారా పోలీస్ స్టేష‌న్‌లో టొల్‌టాక్స్ కాంట్రాక్ట‌ర్ చేసిన ఫిర్యాదు మేర‌కు రిజిస్ట‌ర్ అయిన‌ది. జూన్‌లో సోరేన్ ప్ర‌భు త్వంలో మంత్రిగా వున్న మిశ్రా ఆదేశాల మేర‌కే దాడులు జ‌రిగినట్టు ఫిర్యాదు పేర్కొన్న‌ది. అది కూడా బ‌ధ్వారా న‌గ‌ర పంచాయ‌తీలోకి వ‌చ్చే వాహ‌నాల టోల్ వ‌సూళ్ల పై ర‌గిలిన వివాదంతోనే గొడ‌వ‌లు, దాడు లు జ‌రిగాయి.   

ఈ ఏడాదిలో ఇంత‌కుముందు ఇ.డి. జార్ఖండ్‌లో 18 ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించింది. ఇవ‌న్నీ కూడా సింఘాల్  మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ‌ట్టం నిధుల‌ను రాష్ట్రంలో దుర్వినియోగం చేసిన కేసుకు సంబంధించి జ‌రిపిన‌వే. ఆమెను క‌డా ఇ.డి. అరెస్టు చేసింది.  కాగా, హేమంత్ సోరేన్ మైనింగ్ లీజు కేటాయింపుల్లో అవినీతికి పాల్ప‌డ్డార‌న్న అభియోగంపై శుక్ర‌వారం ఇ.డి. దాడులు చేప‌ట్టిం ది. ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఇసిఐ)  ఇప్ప‌టికే సోరేన్ సోద‌రుడు రాష్ట్ర ఎమ్మెల్యే బ‌సంత్ సొరేన్‌కి మైనింగ్ లీజు ల వ్య‌వ‌హారంలో నోటీసులు పంపింది. దుమ్కా ఎమ్మ‌ల్యే అయిన బ‌సంత్ పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల అంశంలో త‌మ వైఖ‌రిని వ్య‌క్తం చేయ‌మ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇప్ప‌టికే హేమంత్ సొరేన్‌కు నోటీసు జారీ చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...