TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్యాసినో కేసులో తలసాని కుమారుడికి ఈడీ నోటీసులు

Published on: Mon Nov 21, 2022 1:19PM

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు ఈడీ సోమవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ కేసినో కేసు దర్యాప్తులో భాగంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లను ఇప్పటికే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.

బిగ్ డాడీ పేరుతో చీకోటి ప్రవీణ్ నేపాల్ లో నిర్వహించిన కేసీనోకు వెళ్లినట్లుగా భావిస్తున్న వారందరికీ ఈడీ నోటీసులు పంపి విచారణకు పిలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి తలసాని కుమారుడికీ నోటీసులు పంపింది. మొత్తంగా ఈ కేసులో తలసాని సన్నిహితులకు ఈడీ వరుసగా నోటీసులు పంపిస్తుండటం... విచారిస్తుండటం సంచలనం   సృష్టిస్తోంది. కాగా ఇదే కేసులో తలసాని వ్యక్తిగత కార్యదర్శి హరీష్ ను ఈడీ సోమవారం (నవంబర్ 21) విచారించింది. ఈ విచారణకు హరీష్ బ్యాంక్ స్టేట్ మెంట్లతో సహా హాజరైనట్లు చెబుతున్నారు.  

ఇదే కేసులో ఈడీ ఇప్పటికే   టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలను ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఇంకా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులకు కూడా ఈడీ ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. విచారణలో భాగంగా చీకోటి ప్రవీణ్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతోందని భావిస్తున్నారు. ఇలా ఉండగా విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.