లిక్కర్ స్కామ్ కేసు.. ఇక ఈడీ దూకుడు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలకు నిప్పుడు ఉప్పు తోడైనట్లుగా ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇక చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తునకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఇక ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తునకు నడుం బిగించింది. సిట్ నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించింది. మనీ ల్యాండరింగ్ నిరోథక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మద్యం కుంభకోణంతో సంబంధాలున్న పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి శార్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్  చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu