TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. చెవిరెడ్డి కుటుంబంపై ఫోకస్

Published on: Tue May 26, 2026 4:45PM

 

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భార్య, కుమారుడు ఈడీ కార్యాలయానికి హాజరై అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం...చెవిరెడ్డి భార్య పేరుతో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగి నట్లు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. 

ముఖ్యంగా హవాలా మార్గంలో డబ్బుల బదిలీలు, మనీ లాండరింగ్ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల పాత్రపై అధికా రులు ఆరా తీస్తున్నారు. లిక్కర్ వ్యాపారాలకు సంబంధించిన నిధుల మార్పిడి, షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావా దేవీలు, అక్రమ నగదు ప్రవా హాలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.