పర్యావరణ రక్షణ అంటే మొక్కలు నాటడమేనా?
Published on: Mon Jun 6, 2022 3:51PM
పరిసరాలు బాగుంటే అనారోగ్యం దరి జేరదు అనేది పూర్వం నుంచే వుంది. మన ఇంటి పరిసరాలు, ప్రాంతం, మన వూరు, మన పట్టణం వీలయినంత శుభ్రంగా వుంటే మనసు ప్రశాంతంగా వుంటుందనే వారు. అసలు ఎవరికివారు పరిశుభ్రతను పాటించడమన్నది స్వతహాగా అబ్బే గుణం. తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ, ఆ అలవాటు చేస్తూంటారు. నిజానికి ఏ మంచి అలవాటయినా ఇంటి నుంచే అమలు కావాలన్నది గొప్ప సూత్రం.
ఇప్పుడు చెట్లు నాటండి మీ ప్రాంతం అద్భుతంగా మారిపో తుందని లోక మంతా రాజకీయ, సామాజిక నాయకులు, కార్యకర్తలు తెగ ప్రచారం చేస్తున్నారు. వాళ్ల తప్పు కాదు.. కాలం అలా మారింది. కేవలం మొక్కలు నాటడం, చెట్ల సంరక్షణతోనే అంతా అయిపోదు. పరిశుభ్రత అనేది మంచి నీరు, గాలి పొందగలిగే పరిస్థితులు కల్పించుకోవడంలోనూ అమలు చేయడంలోనూ ఉంటుంది. నీరు, గాలి కలుషితమయితే అంతే సంగతులు. వాటి ప్రభావం అంతాయింతా కాదు. అనారోగ్యానికి అంతు వుండదు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు, అర్ధ రహితంగా జరుగుతున్న పరిశ్రమల విస్తర ణతో దాదాపు అన్ని దేశాల్లోనూ వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగిపోయింది.
అందరూ పారిశ్రా మిక అభివృద్ధి, రాజకీయ చిత్ర పటంలో మొదటి స్థానంలో దేశాన్ని నిలబెట్టాలన్న ఆకాంక్షే పెరుగుతోంది. పోనీ అదీ అవసరమే అనుకుందాం. కానీ ఆ విధమయిన అభివృద్ధి కూడా సంక్షేమ కార్య్రకమాలను సక్ర మంగా అమలు చేయడం మీదనే ఆధారపడింది. సంక్షేమం అంటే పరిసరాలు, పర్యావరణ సంరక్షణ కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంటాయన్నది ఇటీవలి కాలం వరకూ పెద్ద దేశాలకు ప్రపంచ పర్యావరణ నిపుణులు, సంఘాలు, సంఘసంస్కర్తలూ మొత్తుకుంటూనే వున్నారు. ప్రభుత్వాలు పాలసీలు మార్చుకోవాలి. అది తప్ప అన్నీ చేస్తున్నారన్నది పర్యావరణ నిపుణుల మాట.
దాన్ని అంతగా పట్టించు కొనకపోవడమే మనందరి దురదృష్టం. పర్యావరణ పరిరక్షణకు మనమంతా ఒక్కటిగా పూనుకోవాలి అంటూ ప్రచారాలు, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, చర్చలు పెట్టుకుని ఫోటోలు తీయించు కోవ డంతోనే అయిపోతోంది. నిపుణులు చెప్పినవి, గోడుపెట్టుకున్న అంశాలు కేవలం ఫైళ్లలో మూలుగుతు న్నాయి. ముఖ్యంగా జల, వాయు కాలుష్యాల విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి గొప్ప చర్యలూ తీసుకో లేదు. అది వారికీ తెలియక పోదు. కానీ రాజకీయాల్లో తలమునకలయి, పీఠాలను కాపాడుకోవడంలో పర్యా వరణం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో ఏడాది కోమారు ఏ నిపుణుడో గట్టిగా ఏ మూలనో అరిస్తే, పెద్ద వ్యాసంతో భయపెడితే తప్ప ఆ సెగ నాయకులకు తగలడం లేదు. ఆ స్పృహ వున్నవారు వారి మాట ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాదపడటం తప్ప మరోటి చేయలేరు. ఎన్నాళ్లు ఎందరితో పోరాడాలి? రాజు కంటే మొండివాడే గొప్ప, పర్యావరణవేత్తలు గోడుపెడుతుంటారు, ప్రభుత్వాధిపతులు, అధికారులు మునులయి విని వూరుకుంటున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ గురించిన ఆలోచన 1970ల్లోనే చేసేరు. పర్యావరణ పరిర క్షణ దినం పాటించాలని పూనుకున్నారు. 143 దేశాలు ఇందుకు కంకణం కట్టుకుని 1974లో తీర్మానం చేసాయి. ప్రతీ ఏడూ జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినంగా తప్పకుండా పాటించాలని ప్రకటిం చారు. ప్రపంచదేశాల్లో ముఖ్యంగా ఆర్ధికంగా, అభవృద్ధిపరంగా బాగా వెనుకబడిన దేశాల పరిస్థితులు మరింత దిగజారిపోకుండా వుండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను అక్కడి ప్రభుత్వా లు తప్పకుండా పాటించి తీరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానించింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యం లో ఏర్పడిన సంస్థ ప్రపంచ పర్యావరణ జాగ్రత్తల విషయమై అనేక విధాల ప్రచారాలు,ప్రకటనలు చేస్తూ ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నది. అంతర్జాతీయ స్థాయి గురించి చర్చించకునే ముందు మన దేశం, మన ప్రాంతం పర్యావరణ పరంగా ఎంత చక్కగా వున్నదీ లేనిదీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఎప్పటికీ కీలకమే. జల, వాయు కాలుష్యాలు, పారిశ్రామికవాడల విస్తరణలు వాటివల్ల కలుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ కంకణం కట్టుకోవాలి.
అనారోగ్యం, అ విద్యతో బాధపడే కంటే సామాజిక, పర్యావరణ స్పృహ పెంచు కోవడం ఎంతో అవసరం. అందువల్ల ప్రభుత్వాలు ప్రకటనలకు,ఉపన్యాసాలు, చర్చలకే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితుల పట్ల దృష్టి సారించితే మానవ మనుగడ మరింత మెరుగుపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశం మనది అంటున్నామే గాని ఇంకా కలుషిత నీటి వల్ల లెక్కలేనన్ని మరణాలు సంభవిస్తున్నాయి. అడవుల నరికివేతతో గిరిజన, ఆటవిక కుటుంబాలు జీవితాలు కోల్పోతు న్నాయి. పర్యావరణ అంశం కూడా చాలా సీరియస్‌గా పట్టించుకోవాలి. కేవలం జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరపడం, నిపుణులతో ఉపన్యాసాలు చెప్పించడం, వ్యాసాలు రాయించి వూరుకోవడం కాకుండా వారిచ్చే సూచనలు, సలహాలు కాస్తం


