బీజేపీకి మరో షాక్.. జమిలి ఎన్నికలు అసాధ్యమన్న ఈసీ.!!

 

‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలి ఎన్నికల కోసం బీజేపీ ఇటీవల దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే అంశంపై అమిత్‌షా లా కమిషన్‌కు లేఖ కూడా రాశారు.. సంవత్సరం పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని.. చాలామంది అధికారులు ఎన్నికల డ్యూటీలో గడపాల్సి రావడం వల్ల మాటామాటికీ జరుగుతున్న ఎన్నికలతో ఖర్చు పెరిగిపోతున్నదని ఆయన లేఖలో పేర్కొన్నారు.. అయితే అమిత్ షా అలా లేఖ రాసారో లేదో, దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తేల్చిచెప్పారు.. 'దేశమంతా ఎన్నికలు జరగాలంటే శాసనసభల గడువు తగ్గించడం లేదా పెంచడం చేయాలి.. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది.. దీనికి న్యాయపరమైన అంశాలు పూర్తి చేయడానికి సమయం పడుతుంది.. వీటికి తోడు వీవీప్యాట్‌ యంత్రాలు 100శాతం అందుబాటులో ఉండాలి.. సమీప భవిష్యత్‌లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం’ అని రావత్‌ స్పష్టం చేసారు.