చంద్రబాబుకి ఈసీ నోటీసులు.. హోం శాఖ సమీక్ష రద్దు

 

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు పోలవరం, సీఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేశారు.

పోలింగ్ తర్వాత మళ్లీ పాలనా పరమైన వ్యవహారాలపై దృష్టి పెడతానని చంద్రబాబు తెలిపారు. పోలవరం మీద, రాష్ట్రంలో తాగునీటి అంశం మీద చంద్రబాబు సమీక్ష నిరవహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. తాజాగా ఈసీ కూడా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించరాదని స్పష్టం చేసింది.