TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈసి నుంచి చిరుకు నోటీసు

Published on: Sun Jun 10, 2012 9:45AM

మతపరమైన వ్యాఖ్యలను చేశారంటూ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి ఎన్నికల కమిషన్ నోటీసు జారి చేసింది. తన నోటీసుకు సత్వర జవాబు ఇవ్వాలని, అదీ 24 గంటల లోపే అని ఈసి పేర్కొంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈసి నోటీసుకు ఖంగుతిన్నారు. ఇప్పుడు చిరంజీవి కుడా నోటీసు అందేసింది. దీనికి ముందు రామచంద్రాపురంలో పర్యటించినప్పుడు మంత్రి ధర్మానప్రసాద్ రావు తమ సోనియాగాంధీ క్రిస్టియన్ అని చెప్పి దొరికిపోయాడు. ఆయన పంపించిన వివరణ కుడా అర్థరహితంగా ఉందంటూ ఇకపై ఎలాంటి ప్రసంగాలు చేస్తే కటిన చర్యలు తప్పవని ధర్మానకు ఈసి సేరియస్ వార్నింగే ఇచ్చేసింది. చావు తప్పి కన్ను లోట్టపోయిందని ఆయన ఊపిరిపీల్చుకున్నారు. ఆ వెంటనే ఆ వంతు ఇప్పుడు చిరంజీవికి వచ్చింది. ఆయన ఏమి వివరణ పంపిస్తారో? దానికైనా ఈసి సంతృప్తి చెందుతుందో లేదో? తేరా పైనే చూడాల్సిన విషయం.