మోదీపై పోటీ చేస్తున్న మాజీ జవాన్ కు నోటీసులు

 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానంలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ సింగ్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవానులకు సరైన ఆహరం అందడంలేదని, నాణ్యమైన భోజనం పెట్టడంలేదని గతంలో తేజ్ బహుదూర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో అధికారుల ఆగ్రహానికి గురై ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు.  

సమాజ్ వాదీ పార్టీ తేజ్ బహుదూర్ వారణాసి టికెట్ కేటాయించింది. నామినేషన్ సమయంలో తాను సర్వీసు నుంచి డిస్మిస్ అయినట్లు తేజ్ బహుదూర్ తెలిపాడు. కానీ తరువాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. ఈ లోపాలను గుర్తించిన ఈసీ ఆయనకు నోటీసులు ఇచ్చి, మే1 వ తేదిలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవినీతి కారణంగా కానీ, దేశాన్ని అగౌరవ పరచడం ద్వారా కానీ సర్వీసుల నుంచి తొలగింపబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు. తేజ్ బహదూర్ ఇచ్చే సమాధానాన్ని బట్టి అతని నామినేషన్ ను ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేస్తారు.