రైతుబంధుకు ఈసీ ఓకే
Published on: Sat Nov 25, 2023 12:40PM
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రైతు బంధు సాయం బంద్ అయ్యింది. ప్రభుత్వం కూడా కోడ్ అడ్డురావడం వల్లే రైతుబంధు సాయం నిలుపుదల చేయాల్సి వచ్చిందని తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకపోయినప్పటికీ రైతుబంధు సాయం ఎగనామం పెట్టడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ప్రతి పక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ రైతుబంధుకు ఓకే చెప్పింది. ఇది రైతులకు శుభవార్త అయినప్పటికీ పోలింగ్ 30న ఉంది. ఈ నేపథ్యంలో రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
రైతుబంధు పథకాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కెసీఆర్ రైతు బంధు సాయం తప్పించుకోవడానికి కోడ్ అడ్డంకి అని డ్రామా ఆడినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


