TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఎన్నికల ఖర్చు మీద ఈసీ నిఘా 

Published on: Thu Oct 12, 2023 3:15PM

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్  విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ పైసా మీద నిఘా పెట్టింది. దేనికెంత ఖర్చు పెట్టాలో క్లారిటీ ఇచ్చింది.  ఈసారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల్లో కచ్చితత్వం కోసం పలు చర్యలు చేపట్టింది. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా ధరల జాబితా విడుదల చేసింది. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తల కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీ.. తదితర వాటికి దేనికెంత అనే వివరాలతో పట్టిక రూపొందించింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చుల లెక్కలు చూపించాలని పేర్కొంది. ఈ ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ధరలు ఇలా ఉన్నాయి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే సభలలోరోజుకు వేటికి ఎంత అనే విషయాలను ఈసీ వెల్లడించింది.ఫంక్షన్ హాల్ రూ.15,000, భారీ బెలూన్ రూ. 4,000, ఎల్ఈడీ తెర రూ.15,000,డీసీఎంవ్యాన్ రూ. 3,000, మినీ బస్సు రూ.3,500, పెద్ద బస్సు రూ.6,000,ఇన్నోవా రూ. 6,000, డ్రోన్ కెమెరా రూ.5,000, పెద్ద సమోసా రూ.10, లీటర్ వాటర్ బాటిల్ రూ.20,పులిహోర రూ.30 (గ్రామీణప్రాంతంలో రూ.20), టిఫిన్ రూ.35 (గ్రామీణ ప్రాంతంలో రూ.30), సాదా భోజనం రూ.80,వెజిటబుల్ బిర్యానీ రూ.80 (గ్రామాల్లో రూ.70), చికెన్ బిర్యానీ రూ.140 (గ్రామాల్లో రూ.100),మటన్ బిర్యానీ రూ.180 (గ్రామీణ ప్రాంతంలో రూ.150).