డీజీపీ అంజనీకుమార్ పై ఈసి వేటు

posted on: Dec 3, 2023 5:12PM

 ఎన్నికల సంఘం తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేసింది. అంజనీ కుమార్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది.

ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని ఈసీ భావించినట్టు సమాచారం.  ఆదివారం  ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే కాంగ్రెస్ హవా స్పష్టమైంది.

ఈ క్రమంలో  డీజీపీ అంజనీకుమార్, మరికొందరు ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...