ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

 

 EC announces poll dates for five states, EC announces election dates, Delhi, MP, Rajasthan, Mizoram

 

 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల ప్రధానాధికారి విఎస్ సంపత్ విడుదల చేశారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్‌గడ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. చత్తీస్‌గడ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుందని, నవంబర్ 11న తొలిదశ, 19న రెండో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలోనే పోలింగ్ జరుగుతుందని, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న పోలింగ్, రాజస్థాన్‌లో డిసెంబర్ 1న పోలింగ్, ఢిల్లీ, మిజోరాంలలో డిసెంబర్ 4న పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది.

 

 

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని, ఎన్నికలకు ముందే అర్హులైన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందని ఈసీ పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, లక్షా 30 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.