TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికలపై బెట్టింగ్ ల జోరు

Published on: Wed Mar 14, 2012 6:06PM

కాదేదీ బెట్టింగ్ లకు అనర్హం అని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా బెట్టింగ్ రాయుళ్ళు, భీమవరం బెట్టింగ్ కు పెట్టింది పేరు. క్రికెట్ సీజన్ లో ఇక్కడ కోట్లాది రూపాయల బెట్టింగ్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎన్నికలప్పుడు కూడా బెట్టింగ్ రాయుళ్ళు హడావిడిగా ఉంటారు. గతంలో తమ ప్రాంతంలో జరిగే ఎన్నికలపై బెట్టింగ్ లు కట్టేవారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉపపోరుపై కూడా వారు బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ ఉపపోరులో టిఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయి. టిడిపి, కాంగ్రెస్ ఎన్ని చోట్ల డిపాజిట్ గల్లంతవుతుంది అన్న విషయాలపై కూడా భీమవరంలో బెట్టింగ్ జరుగుతోంది. తెలంగాణా ఉపఎన్నికలపై ఇప్పటి వరకు సుమారు రూ. 2 కోట్ల వరకు పందాలు జరిగినట్లు అంచనా. ఇక్కడ ఒకటికి రెండు రెట్లు కోసు పందాలు కూడా జోరుగా నడుస్తున్నాయి.