TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తూర్పు, పశ్చిమ గోదావరి అభివృద్ధి ప్రణాళిక...

Published on: Thu Sep 4, 2014 1:22PM

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో ఇరవై పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రతిపాదనలలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి..

 

తూర్పు గోదావరి జిల్లా:

 

తూర్పు గోదావరి జిల్లాకు పెట్రోలియం యూనివర్శిటీ, పోర్ట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, వీసీఐసీ కారిడార్, విశాఖ -చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్లోకి కాకినాడ, తెలుగు యూనివర్శిటీ, కొబ్బరిపీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్, స్మార్ట్ సిటీస్గా రాజమండ్రి, కాకినాడ, ఫుడ్ పార్క్, టూరిజం, భూఉపరితల జలమార్గం, కాకినాడలో ఎస్ఎన్జీ టెర్మినల్, తునిలో నౌక నిర్మాణ కేంద్రం, ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్, ఐటీ హబ్గా రాజమండ్రి.

 

పశ్చిమ గోదావరి జిల్లా:

 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్, నరసాపురం పోర్టు, తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు, సిరామిక్ పరిశ్రమ, ఆయిల్ పామ్ పరిశ్రమ, పర్యాటక కేంద్రంగా కొల్లేరు, జలమార్గాల అభివృద్ధి, చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత, పోలవరం ప్రాజెక్టు, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, మెట్ట ప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్, ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఉద్యానవన పరిశోధన కేంద్రం.