పిల్లి -తోట పోటా పోటీ
Published on: Wed Mar 21, 2012 2:30PM
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కాకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుబాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయమంతా నేరుగా ఓటర్లను కలుసుకుని, సాయంత్రం వేళకు ద్వితీయ శ్రేణి నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ టిడిపి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఈ నియోజకవర్గంలో పోటీచేయడానికి కట్టా సూర్యనారాయణ, నెక్కంటి బాలకృష్ణ, గొడ్డు విష్ణుమూర్తి, సత్తిబాబు, యు.వి.వి.చౌదరి, దొంతంశెట్టి విరూపాక్షం, బి, వెంకట్రావ్, ఎమ్. రవి కుమార్, ఎంవివి రామారావు, మేడిశెట్టి శేషారావు తదితరులు ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు మూడు రోజుల్లో వీరిలో ఒకరిని తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


