TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సర్దుకుపోతున్న ద్వారంపూడి...ఇంతకీ ఏ పార్టీ అంటారు?

Published on: Mon Oct 1, 2012 8:39AM

East Godavari, MLA Dwarampudi Chandrasekhar Reddy, YSRCP, Congress Party, Congress Cadre, Attending All Functions, Which Party, Janani Infra Case, CBI Enquiry,

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రతీ విషయంలోనూ సర్దుకుపోతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు, చంచల్‌గూడా జైలులో ఉన్న తరువాత ఈయన కూడా వైకాపాలోకి మారారు. కాంగ్రెసుపార్టీని వదిలి వైకాపాలోకి మారాక ద్వారంపూడి కార్యకర్తలకు కొంత దూరమయ్యారు. దాదాపుగా కాంగ్రెసు కార్యకర్తలు ఈయన అధికారాన్ని వినియోగించుకోవాలనే ప్రయత్నిస్తున్నారు కానీ, ఈయన వెనుక ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని గమనించిన చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్‌ నాయకులతోనూ, మంత్రులతోనూ సఖ్యత నటిస్తున్నారు. మంత్రులు ఏ పని చెప్పినా జిల్లా కేంద్రమైన కాకినాడలో వారి తరుపున తాను స్వయంగా హాజరై ఆ పనిని చక్కబెడుతున్నారు. దీంతో ఈయన్ని కూడా పిలవకతప్పదనే పరిస్థితి ద్వారంపూడి కల్పించుకుంటున్నారు. అయితే కాంగ్రెసుపార్టీ కార్యక్రమాలకు మాత్రం ఈయన్ని పిలవటం లేదు. అడపాదడపా తెలిసిన కార్యక్రమాలకు కూడా హాజరయ్యేందుకు ద్వారంపూడి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ కార్పొరేటర్లను, వార్డుల వారీగా ద్వితీయశ్రేణిలో ఉన్న నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే ఎవరు ఏ పని మీద తన దగ్గరకు వచ్చినా పార్టీ ప్రస్తావన తీసుకురావటం లేదట. అంతేకాకుండా కాంగ్రెసు నాయకులతో తరుచుగా కనిపిస్తుంటే ఇంతకీ ద్వారంపూడి ఏ పార్టీ అన్న సందేహం కూడా ఎక్కువైందంటున్నారు. ఈ విషయం తేల్చేందుకు ప్రయత్నిస్తే తాను వైకాపాలోనే ఉన్నానంటున్నారు. మరి కాంగ్రెసువారితో కలిసి తిరుగుతున్నారంటే ,పార్టీల దేముందండీ అంటూ ఆ ప్రశ్నను అలానే మిగిల్చి మాయమవుతున్నారట. ఇటీవల సాక్షిభవనాల నిర్మాణాల విషయంలో సిబిఐ విచారణ ఎదుర్కొన్న ద్వారంపూడి భవిష్యత్తులో మళ్లీ సిబిఐ ముందుకు అదే జననీ ఇన్‌ఫ్రా కేసులో హాజరవుతారని తూర్పుగోదావరి జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. ఈసారి ఆ సొమ్ముకు లెక్కచెబితే మాత్రం వైకాపాలోకి ద్వారంపూడి మారినట్లు కాకినాడ ఓటర్లు నమ్ముతారు.