TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తగ్గుతున్న రిలయన్స్ పన్నుల చెల్లింపు

Published on: Sat Mar 10, 2012 1:17PM

తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య పన్నులశాఖకు ప్రధానంగా పన్నుల రూపంలో చమురు సంస్థలు ఆదాయాన్ని ఇస్తున్నాయి. రిలయన్స్, ఓఎన్ జిసి, గెయిల్ సంస్థల నుంచి ఏటా వందలాదికోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల రూపంలో ఇస్తున్నాయి. రిలయన్స్, ఓఎన్ జిసి, గెయిల్ సంస్థల నుంచి ఏటా వందలాదికోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల రూపంలో తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లానుంచి లభిస్తున్నాయి. నిజానికి ఈ పన్నుల రాబడి ఏటేటా పెరగాల్సి ఉండగా, అనూహ్యంగా రిలయన్స్ మాత్రం పన్నులను తక్కువగా కడుతోంది. గత ఏడాది రిలయన్స్ రూ.471 కోట్లు వాణిజ్య పన్నుల రూపంలో చెల్లించగా వర్తమాన సంవత్సరంలో 373 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇదే సమయంలో ఓఎస్ జిసి చెల్లించిన వాణిజ్య పన్నులు రూ.129 కోట్లనుంచి రూ.167 కోట్ల వరకు, గెయిల్ సంస్థ చెల్లించిన వాణిజ్య పన్నులు 21 కోట్లనుంచి 78కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ రంగానికి చెందిన రెండు చమురు, గ్యాస్ సంస్థల వాణిజ్య పన్నుల చెల్లింపు ఏటేటా పెరగుతుండగా రిలయన్స్ పన్నులు మాత్రం తగ్గుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రిలయన్స్ వెలికి తీస్తున్న బావుల్లో చమురు తగ్గిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గి ఆ మేరకు వాణిజ్య పన్నులు  తగ్గుతున్నాయని ఆ సంస్థ అధికారులు అంటున్నారు. అయితే వీటికి సమీపాన గల  ఓఎన్ జిసి బావుల నుంచి చమురు ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరగడంతో ఆ సంస్థ పన్నులచెల్లింపు కూడా 20శాతం పెరిగింది. దీంతో రిలయన్స్ చెప్పే వాదనల్లో నిజం లేదని వెల్లడవుతుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే తప్ప నిజానిజాలు వెల్లడి కావని స్థానికులు అంటున్నారు.