ఈసురోమంటున్న 'తూర్పు'ఉప్పు రైతు
Published on: Fri Feb 24, 2012 10:15AM
తూర్
పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పు పండించే రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టపడి పండించిన ఉప్పుకు తగిన ధర రాక, బహుళ జాతి సంస్థల తాకిడి తట్టుకోలేక సతమతమవుతున్నారు. కాకినాడ సమీపంలోని జగనాధపురం, పోరింగా, గురజానపల్లి, పెనుగుదురు ప్రాంతాల్లో సుమారు 1500 ఎకరాల్లో వెయ్యి కుటుంబాలు ఉప్పు పండిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి జూలై వరకు వర్షం, తుఫానులు రాకుండా ఉంటె దిగుబడి ఎకరానికి 15 టన్నులు వస్తుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే వీరి శ్రమంతా నీరుగారి వృధాగా పోతుంది. దీనికి తోడు అయోడైజ్ద్ సాల్ట్ మార్కెట్ ను ఆక్రమించడంతో వీరు తయారుచేస్తున్న ఉప్పుకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇక్కడి ఉప్పు చేపల చెరువులకు, కొన్ని పరిశ్రమలకు అవసరం ఉంది. అయితే రవాణా ఛార్జీలు పెరిగిపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు తమవద్దకు తీసుకువచ్చి అప్పజెప్పే పద్దతిన బేరాలాడుతుంటే రైతులకు గిట్టుబాటు కావడం లేదు. గుజరాత్ లో ఉప్పు రైతులు యంత్రాలను ఉపయోగించి లాభాలు అర్జిస్తున్నారు. మన రాష్ట్రంలోని ఉప్పు రైతులు కూడా ఆధునిక పద్దతులు అవలంభించాల్సిన అవసరం ఉంది. దీనికి వీరు ప్రభుత్వ సహాయాన్ని అర్దిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లాలో ఉప్పుసాగు అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది.


