TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తూర్పుగోదావరిలో అనధికార స్కానింగ్ సెంటర్లు

Published on: Tue Feb 21, 2012 10:15AM

లింగ నిర్ధారణలతో తగ్గుతున్న బాలికల నిష్పత్తి
తూర్పుగోదావరి:    తూర్పుగోదావరి జిల్లాలో అసంఖ్యాకంగా వెలసిన అనధికార స్కానింగ్ సెంటర్లు జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ చేయకూడదు. అయితే ఈ అనధికార స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేస్తూ పుట్టబోయే బిడ్డ ఆడా లేదా మగా అని ముందే చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆడబిడ్డ గర్భంలో ఉన్నట్లు తెలిస్తే తల్లిదండ్రులు భ్రూణ హత్యకు పాల్పడుతున్నారు. దీనివల్ల జిల్లాలో బాలికల నిష్పత్తి బాగా తగ్గింది. రాష్ట్రంలో ఎక్కడైనా స్కానింగ్ సెంటర్ ఏర్పాటుచేయాలంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు రూ.3000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించాలి. కాని ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే జిల్లాలో సుమారు 200 స్కానింగ్ సెంటర్లు నడుస్తున్నట్లు తెలిసింది. ఈ స్కానింగ్ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణహత్యల పాపం మూటగట్టుకుంటున్నాయి.