TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తూర్పు గోదావరిలో ఇసుక మాఫియా

Published on: Mon Feb 20, 2012 3:10PM

చుక్కలనంటిన ఇసుక ధర
తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక రీచ్ లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సిండికేటై ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. 1500 రూపాయలుగా ఉన్న లారీ ఇసుక సిండికేట్ల ఇష్టారాజ్యంలో ప్రస్తుతం రూ.3,500 నుంచి 4000లకు పెరిగింది. రీచ్ నిర్వాహకులంతా ఒక సిండికేట్ గా ఏర్పడి ఇసుక ధరలను అడ్డగోలుగా పెంచేశారు. ఈ ధరలను నియంత్రించాల్సిన గనులశాఖ ముడుపులు మెక్కి చేష్టలుడిగి చూస్తోంది. ఇసుక రీచ్ ల వేలం ద్వారా ప్రభుత్వానికి జమ అవుతున్న ఆదాయం రూ.30కోట్లు. కాని సిండికేట్లు ఇందుకు ఆరు రెట్లు అధికంగా రూ.180 కోట్లు అర్జిస్తున్నారు. ఇసుక రీచ్ ల నుంచి జిల్లాలో నిర్మాణాలకోసం ప్రతిరోజూ 1500 లారీల ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.52 లక్షల వంతున నేలకు రూ.16కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. సిండికేట్ ఏర్పాటుకు ముందు లారీ ఇసుకను రూ.1500లకు విక్రయించే సందర్భంలో  రోజుకు రూ.23 లక్షల ఆదాయం రావాలి. అంటే నేలకు సుమారు రూ.7 కోట్ల ఆదాయం మాత్రమే రావాలి. కానీ సిండికేట్ దెబ్బకు జనంపై ఎనిమిదిన్నర కోట్లు అదనపు భారం మోపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు, కొందరు అధికారులు కూడా మద్యం సిండికేట్ తరహాలోనే ఈ వ్యవహారంలో కూడా పీకల దాకా కూరుకుపోయారనే విమర్సలు వస్తున్నాయి.